New Songs Lyrics Telugu

Saturday, April 26, 2025

Pillaa Song Lyrics-Jaabilamma Neeku Antha Kopama

April 26, 2025 0

Pillaa Lyrics - Krishna Tejasvi


హీరో ధనుష్ దర్శకత్వం వహించిన (Jaabilamma Niku Antha Kopama) జాబిలమ్మ నీకు అంత కోపమా (Nilavuku En Mel Ennadi Kobam) సినిమా నుండి పిల్లా పాటని జి వి ప్రకాష్ సంగీతం అందించగా, రాంబాబు గోసాల సాహిత్యం అందించగా క్రిష్ణ తేజస్వి పాడటం జరిగింది. 



Pillaa Song Information

Song Name: Pillaa

Movie: Jaabilamma Niku Antha Kopama

Cast: Pavish, Ankita, Priya Prakash Varrier

Music: G V Prakash Kumar

Lyrics: Rambabu Gosala

Singers: Krishna Tejasvi

Director: Dhanush

Producer:  Kasthoori Raja & Vijayalakshmi Kasthoori Raja


Pillaa Song Lyrics

నీతోనే ఉంటే చాలే పిల్లా
నిన్నొదిలి ఉండేదెన్నాళ్ళిలా…??

నీతోనే ఉంటే చాలే పిల్లా
నిన్నొదిలి ఉండేదెన్నాళ్ళిలా…??

ఊపిరి పొసే నీ ఊసు
శ్వాసగా నాకే అందించు
అయ్యాయ్యో గుండె ఆడేదెల్లా
మన్నుల్లో నన్నే కలిపెయ్యాలా

కొంచెం ప్రేమగ లాలించు
పిచ్చిది అయ్యే నా మనసు
ఊరించి మాయం అవ్వకు పిల్లా
మత్తుల్లో మెల్లగ ముంచితే ఎల్లా?

హేయ్, గుండెలో నిప్పే రగిలించి
ప్రాణం కాల్చకు మంటేసి
గొంతులొ మాటను దాచేసి
మౌనంగుంటావే రాకాసి…

ఉప్పెనలోంచి లాగేసెయ్‌వే
కాటుక కళ్ళతో వలలేసి
కంటిపాపే ఏడ్చి ఏడ్చి
వాలిందంట అలుపొచ్చి

కాదని అవునని విసిగించి
ఒంటరి చేసావే వేధించి
నిన్ను నన్ను విడదీసి
పోయెను కాలం నవ్వేసి

నేనేమైపోనే చెప్పవే పిల్లా
మబ్బుల్లో దాగకు జాబిల్లిలా

ఎక్కడకెళ్ళావమ్మాయి?
అన్ని దిక్కులు నువ్వయ్యి
అయ్యాయ్యో గుండె ఆడేదెల్లా?
మన్నుల్లో నన్నే కలిపెయ్యాలా



WATCH  పిల్లా  LYRICAL VIDEO SONG


Friday, April 25, 2025

Kollagottinadhiro Song Lyrics

April 25, 2025 0

Kollagottinadhiro Lyrics  - Mangli, Rahul Sipligunj, Ramya Behara, Yamini Ghantasala


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీర మల్లు పార్ట్ 1 . పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు తక్కువ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక తను సినిమా అనే పదానికి దూరంయ్యాడని చెప్పొచ్చు. కానీ ఇప్పటికే మొదలుపెట్టి మధ్యలో ఉన్న సినిమా హరి హర వీర మల్లు.  ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు దర్శకుడు క్రిష్, కానీ ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆలస్యమవటంతో దర్శకుడిగా క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. మిగతా సినిమాని ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమాకి ఆస్కార్ విజేతలు కలసి పనిచేసారు. మ్యూజిక్ యం.యం కీరవాణి అందించగా చంద్రబోస్ ఈ పాటని రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాడటం జరిగింది.





Song Information

Song Name: Kollagottindhiro

Movie: Hari Hara Veera Mallu

Cast: Pawan Kalyan, Nidhhi Agerwal, Bobby Deol

Music: M M Keeravani

Lyrics: Chandrabose

Singers: Mangli, Rahul Sipligunj , Ramya Behara, Yamini Ghantasala

Director: Jyothi Krisna & Krish Jagarlamudi

Producer:  A. Dayakar Rao


Lyrics in Telugu

కోర కోర మీసాలతో
కొదమ కొదమ అడుగులతో
కొంటె కొంటె చెనుకులతో
కొలిమిలాంటి మగతిమితో

సరసర వచ్చినాడు
చిచ్చర పిడుగంటివాడు
ఎదో ఎదో తలచినాడు
ఎవ్వరినో వెతికినాడు

ఎవరంట ఎవరంట… ఎవరెవరంట
ఎవరంట ఎవరంట ఎవరెవరెవరెవరంట

కొండపల్లి ఎండి బొమ్మా
కోల కళ్లతో చూసిందమ్మా
తియ్య తియ్యని తేనెలకొమ్మ, ఆ ఆ ఆ
తియ్యని తెరలే తీసిందమ్మా…
(యాయియే యాయ్ యాయ్)

వజ్రాల జిలుగులున్న
రత్నాల ఏలుగులున్న
కెంపుల్ల ఒంపులున్న
మొహరీలా మెరుపులున్నా, ఓ ఓ హో
నా పైడి గుండెలోన ఏడి పుట్టించి
మరిగించి మరిగించి… కరిగించి కరిగించి

కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో… ముల్లేగట్టినాదిరో

నారిన్ననో, నారిన్ననో నారిన్ననో, ఓ ఓ
నారిన్న నారిన్ననో…

అయ్యయ్యయ్యో… అయ్యయ్యయ్యో
ఆ చిన్నదీ ఇంకేమి చేసిందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
ఆ కుర్రదీ… ఏ మంత్రమేసిందయ్యో

కన్నులలోని… కాటుక మేఘం
సీకటి నాపై సిలికిందే…
మాటలతోనే… మెలికేసిందే
మర్మం ఏదో దాసిందే…

ఆడవాళ్ళ మనసు అడవిలాంటిదని
ఎరగని సంటోడివా??
అంత అమాయకుడివా
పడుసుపిల్ల తీరు
పట్టుసిక్కదని పసిగట్టలేనోడివా..!
ఒట్టి శొంటికొమ్మువా..?
లేత ఎన్నపూసవా..?

అరె మీసాల రోషాల
మొనగాన్ని పట్టేసి
పసివాన్ని చేసేసి
పసరేదో పూసేసి…

కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో… ముల్లేగట్టినాదిరో

నారిన్ననో, నారిన్ననో నారిన్ననో, ఓ ఓ
నారిన్న నారిన్ననో…

హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్… హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్

ఊపిరిలోని ఆవిరి పవనాలే
విరివిగ లేఖలే విసిరేనే
ఉప్పెనలాగ పొంగే పౌరుషమే
సొగసుకు సంకెల వేసేనే

చీకుచింత లేని వాడి చిత్తం దోచావే
పారహుషార్ పోరగాడ్ని పాగల్ చేసావే
దారెదైనా దవ్వేదైన నీడై ఉంటానే
పేరేదైనా తీరేదైనా పెనిమిటి అంటానే

అడ్డడ్డే, కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో… ముల్లేగట్టినాదిరో

నారిన్ననో, నారిన్ననో నారిన్ననో, ఓ ఓ
నారిన్న నారిన్ననో…


WATCH  కొల్లగొట్టిందిరో  LYRICAL VIDEO SONG

Thursday, April 24, 2025

Yetu Poyaave Song Lyrics

April 24, 2025 0

Yetu Poyaave Lyrics - Krishna Tejasvi

హీరో ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా నుండి యెటు పోయావే పాట  తెలుగులో విడుదల చేసారు. ఈ పాటని రాంబాబు గోసాల రాయగా, జి వి ప్రకాష్ సంగీతం అందించాడు. ఈ విషాద గీతాన్ని కృష్ణ తేజస్వి పాడారు. 

తను ప్రేమించిన అమ్మాయి విడిచి వెళ్లి పోతుండటంతో యెటు పోయావే నన్ను వొదిలి, ఒంటరిని చేసి యెటు పోయవే, నా ఊపిరివే యెటు పోయావే అంటూ సాగే విరహ గీతం. 

 


New Song Lyrics Telugu











Song Information

Song Name: Yetu Poyave

Movie: Jaabilamma Niku Antha Kopama

Cast: Pavish, Ankita, Priya Prakash Varrier

Music: G V Prakash Kumar

Lyrics: Rambabu Gosala

Singers: Krishna Tejasvi

Director: Dhanush

Producer:  Kasthoori Raja & Vijayalakshmi Kasthoori Raja


 

Yetu Poyaave Song Lyrics


యెటు పొయావే యెటు పోయావ్  ఎటు పోయావ్ ఎటు పోయావ్ 

నా ప్రియా నువ్వే ఎటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్

యెటు పొయావే యెటు పోయావ్  ఎటు పోయావ్ ఎటు పోయావ్ 

నా ప్రియా నువ్వే ఎటు పోయావ్ ఎటు పోయావ్ ఎటు పోయావ్


నా కలలే కాల్చి యెటు పోయావ్ 

ఒంటరి చేసి యెటు పోయావ్  ఎటు పోయావ్ ఎటు పోయావ్ 

నా కలలే కాల్చి యెటు పోయావ్ 

ఒంటరి చేసి యెటు పోయావ్  ఎటు పోయావ్ ఎటు పోయావ్ 

ఊపిరివే యెటు పోయావ్ 

ఊపిరివే యెటు పోయావ్  ఎటు పోయావ్ ఎటు పోయావ్

ఊపిరివే యెటు పోయావ్ 

 ఊపిరివే యెటు పోయావ్  ఎటు పోయావ్ ఎటు పోయావ్

రావే రావే ప్రేయసి రావే నీ కళ్ళు చూసి ఎన్నాల్లె 

వేచి వేచి ఏడ్చి ఏడ్చి  వేడెక్కెనే కన్నీళ్ళే


యెటు పొయావే యెటు పోయావ్ నువ్వెటు పోయవె  యెటు పోయావ్

యెటు పొయావే యెటు పోయావ్ నువ్వెటు పోయవె  యెటు పోయావ్

నన్నొదిలి యెటు పోయావ్ ఒంటరి చేసి యెటు పోయావ్

ఊపిరివే యెటు పోయావ్ నా ఊపిరివే యెటు పోయావ్

ఊపిరివే యెటు పోయావ్ నా ఊపిరివే యెటు పోయావ్




WATCH  యెటు పోయావే  LYRICAL VIDEO SONG

Wednesday, April 23, 2025

Yedhee Song Lyrics- Jaabilamma Neeku Antha Kopama

April 23, 2025 0

Yedhee Lyrics - Amal C Ajith & Sruthy Sivadas    


Nilavuku En Mel Ennadi Kobam ఈ తమిళ సినిమాని తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా  (Jaabilamma Neeku Antha Kopama) పేరుతొ వచ్చింది. ఈ సినిమాకి కోలివుడ్ స్టార్ హీరో ధనుష్. ఈ మధ్య ధనుష్ హీరోగా నటిస్తూనే దర్శకునిగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే రాయన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. 

ఈ సినిమాకి మరొక హీరో మరియు సంగీత దర్శకుడు జి.వి ప్రకాష్ సంగీతం అందించాడు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా అమల్ మరియు శ్రుతి ఈ పాటని పాడారు. 



New Songs Lyrics Telugu













Yedhee Song Information

Song Name: Yedhee

Movie: Jaabilamma Niku Antha Kopama

Cast: Pavish, Ankita, Priya Prakash Varrier

Music: G V Prakash Kumar

Lyrics: Rambabu Gosala

Singers: Amal C Ajith & Sruthy Sivadas

Director: Dhanush

Producer:  Kasthoori Raja & Vijayalakshmi Kasthoori Raja


Yedhee Song Lyrics


ఏదేదో పలికే… నా పెదవుల మౌనం
నీ పేరే నీ పేరే పిలిచేనులే…
నీ పిచ్చితోనే… అల్లాడే ప్రాణం
నిన్నేలే నిన్నేలే తలచేనులే

ఏదీ… నీ చిలిపి చిరునవ్వే కురిపించు
ఏదీ… నీ చూపే ఎదలో దించు
ఏదీ… నీ ఊసుల ఊయల్లో తేలించు
ఏదీ… నీ ఊహను నాకందించు

ఏదీ… నాపై ఇష్టం చూపించు
ఏదీ… ఇప్పుడు దూరం తెంచు
ఏదీ… ఇంకా మైమరుపే పెంచు
ఏదీ… జతగా చెయ్యందించు

ఓ… చలువ చెలిమి చూపులే
కలువ కనులు దోచెలే…
ప్రేమ పూల జల్లులే
కురిసి మనసు తడిసెలే…

మెరిసే రంగుల విల్లులే
ఒడిలోకొచ్చి వాలెలే
శిలలే విరులై మారెలే
పరిమళమేదో పంచెలే

ఏదీ… నీ చిలిపి చిరునవ్వే కురిపించు
ఏదీ… నీ చూపే ఎదలో దించు
ఏదీ… నీ ఊసుల ఊయల్లో తేలించు
ఏదీ… నీ ఊహను నాకందించు

ఏదీ… నాపై ఇష్టం చూపించు
ఏదీ… ఇప్పుడు దూరం తెంచు
ఏదీ… ఇంకా మైమరుపే పెంచు
ఏదీ… జతగా చెయ్యందించు

ఏదేదో పలికే… నా పెదవుల మౌనం
నీ పేరే నీ పేరే పిలిచేనులే…
నీ పిచ్చితోనే… అల్లాడే ప్రాణం
నిన్నేలే నిన్నేలే తలచేనులే

ఏదీ ఏదీ… ఏదీ ఏదీ
ఏదీ ఏదీ… ఏదీ ఏదీ


WATCH  ఏదీ ...  LYRICAL VIDEO SONG

Tuesday, April 22, 2025

Andhamaa Andhamaa Song Lyrics

April 22, 2025 0

Andhamaa Andhamaa Lyrics - Hesham Abdul Wahab, Aavani Malhar 

8 వసంతాలు సినిమా నుండి అందమా అందమా పాట వినడానికి చాలా బాగుంది. Hesham తానే సంగీతం అందించి పాడటం జరిగింది.   హాయ్ నాన్న సినిమాకి  Hesham అందించిన పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో  తెలిసిందే. దాని తరువాత ఈ 8 వసంతాలు సినిమా చేస్తున్నాడు Hesham. అందమా అందమా అంటూ వనమాలి చాలా బాగా సాహిత్యాన్ని అందించారు.  ఈ మధ్య తెలుగు సినిమాల్లో  కొత్త సంగీత దర్శకులు చాలా కొత్తగా  తప్పని సరిగా ఒక క్లాసిక్ సాంగ్ ఉండే విధంగా చూస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటివి వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాట కూడా ఆ కోవకి చెందుతుంది.

మీరు కూడా ఒకసారి క్రింద  లిరిక్స్ చదువుతూ పాట వినండి.  



Andhamaa Andhamaa Lyrics



Andhamaa Andhamaa Song Information

Song Name: Andhamaa Andhamaa

Movie: 8 Vasantalu

Cast: Ananthika Sanilkumar

Music: Hesham Abdul Wahab

Lyrics: Vanamaali

Singers: Abdul Wahab, Aavani Malhar

Director: Phanindra Narsetti

Producer:  Mythri Movie Makers



Andhamaa Andhamaa Lyrics

అందమా అందమా
నువ్వు నా సొంతమా
స్నేహమా మోహమా
తేల్చవా ప్రాణమా…

నీ పరిచయం… ఓ చిత్రమా
నీ దర్శనం… ఆ చైత్రమా
నీ సన్నిధే సౌఖ్యమా

నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమా..?
నీ జత లేక నిలవడమిక నా తరమా..?

అందమా అందమా
నువ్వు నా సొంతమా
స్నేహమా మోహమా
తేల్చవా ప్రాణమా…

ఏ నడిరేయి నీ ఊహల్లో…నే కనుతెరిచినా
నీ చిరునవ్వు లో ఉదయాలు… నా దరిచేరెనా
నా జాముల్లో నీ స్వప్నాలు… ఆ హరివిల్లులా
ఈ గుండెల్లో నీ వర్ణాల రూపం నింపెనా

మనసు తలుపు తెరిచి ఎదురు చూశా
కలల బరువు కనుల వెనక మోశా
ఒకరికొకరు బయట పడని వేళ
ఎవరు తెలుపగలరు కడకు వలపునిలా
ఆరదీ జ్వాలా….

వెన్నెలా వెన్నెలా
కురిసె నా కన్నులా
మంచులా మాయలా
కమ్మెనా ఈ కలా…

నీ పలుకులే… సంగీతమా
నీ రాక వాసంతమా…

నీతో అడుగులు వేస్తుందా ఈ ప్రేమా..?
నీ జతలో గడిపే ఈ క్షణమే నిజమా..?

అందమా అందమా
నువ్వు నా సొంతమా
స్నేహమా మోహమా
తేల్చవా ప్రాణమా…



WATCH  అందమా అందమా  LYRICAL VIDEO SONG

Monday, April 21, 2025

Modhati Chinuku Song Lyrics

April 21, 2025 0

Modhati Chinuku Lyrics - Sid Sriram

బుల్లితెర మీద విజయాన్ని అందుకొని తమకంటూ ప్రేక్షక అభిమానుల్ని సంపాదించుకున్న  ఒక టీమ్ మొత్తం కలిసి తీసిన సినిమానే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకులు నితిన్-భరత్, వీళ్ళు ఈ టివి లో ప్రసారమవుతున్న పాపులర్ కామెడి షో జబర్దస్త్ సృష్టి కర్తలు. అలాగే హీరో హీరోయిన్లు ప్రదీప్ మాచి రాజు, దీపిక పిల్లి, వీరిద్దరూ బుల్లితెర ద్వారా సుపరిచుతులే. ప్రదీప్ మాత్రం దీనికి ముందు ఒక సినిమా చేయడం జరిగింది. తరువాత ఎందుకనో బుల్లితెరకి వచేసాడు. తరువాత ఇన్ని రోజులకు నితిన్- భరత్ ల దర్శకత్వంలో రెండవ సినిమాని చేసాడు. 


ఈ సినిమాలోని మొదటి చినుకు పాటని సిద్ శ్రీ రామ్ పాడటం జరిగింది. చంద్రబోసు రాసిన ఈ పాటకి అర్జున్ రెడ్డి సినిమాకి సంగీతం అందిచిన రాధన్ సంగీతం అందిచడం జరిగింది. 

ఈ పాట విడియో చూడకుండా వింటే ఒక అనుభూతి కలుగుతుంది. కానీ విడియో చూస్తె వేరే వాళ్ళ పాటకి ప్రదీప్ మాచి రాజు , దీపిక  పిల్లి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని మనం కొన్ని  టివి  షో లలో వాళ్ళని వేరే పాటలకి డ్యాన్స్ చేస్తూ చూడడమే. 
 
మొదటి చినుకు కురిసినపుడు  నేల గొంతులో… ఎంత హయో   మొదటి ప్రేమ కలిగినపుడు గుండె లోతులో… అంత హాయి. 
అంటూ సాగే ఈ పాటతో పాటు చంద్రబోసు గారి సాహిత్యం కూడా బాగుంది.   మరి మీరు కూడా  ఒకసారి ఈ పాటని చదువుతూ వినండి.


Modati Chinuku Song











Modhati Chinuku Song Information

Song Name: Modati Chinuku

Movie: Akkada Ammayi Ikkada Abbayi

Cast: Pradeep Machiraju, Deepika Pilli

Music: Radhan

Lyrics: Chandrabose

Singers: Sid Sriram

Director: Nitin - Bharath

Producer:  Monks & Monkeys


Modhati Chinuku Lyrics

ఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ…..
పిల్లా… ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో
పిల్లా… మనసు దోచుకెళ్ళావే
దొంగ చూపుల కళ్ళ గాలాలతో

మొదటి చినుకు కురిసినపుడు
నేల గొంతులో… ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినపుడు
గుండె లోతులో… అంత హాయి

మొదటి చినుకు కురిసినపుడు
నేల గొంతులో… ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినపుడు
గుండె లోతులో… అంత హాయి

గాలిలో తనువు ఇక
గంతులేసే వింతగా
ప్రేమలో తడిసినది పూర్తిగా, ఆ
ఇది వరకు ఇంతగా
ఎద ఉరుకు లేదుగా
కథ మొదలైందిగా
తుది వరకు ఆగిపోదుగా

ఈ క్షణాలు అన్ని సంతకాలుగా
ఇలా ఉండిపోని శాశ్వతాలుగా

మొదటి చినుకు కురిసినపుడు
నేల గొంతులో… ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినపుడు
గుండె లోతులో… అంత హాయి

పిల్లా… ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో
పిల్లా… మనసు దోచుకెళ్ళావే
దొంగ చూపుల కళ్ళ గాలలతో

మొదటి చినుకు కురిసినపుడు
నేల గొంతులో… ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినపుడు
గుండె లోతులో… అంత హాయి

మొదటి చినుకు కురిసినపుడు
నేల గొంతులో… ఎంత హయో
మొదటి ప్రేమ కలిగినపుడు
గుండె లోతులో… అంత హాయి

పిల్లా… ఎంత మాయ చేసావే
చిలిపి చిన్ని చిరునవ్వుతో….




WATCH  మొదటి చినుకు  LYRICAL VIDEO SONG

Sunday, April 20, 2025

Poyiraa Mama Song Lyrics and Review

April 20, 2025 0

Sekhar Kammula's Kuberaa Poyiraa Mama song Review


Poyiraa Mama Lyrics - Dhanush- KUBERAA


ఈ రోజు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రాబోతున్న కుబేర నుండి లిరికల్ వీడియోని విడుదల చేసారు. మొదటగా ఇక్కడ అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే శేఖర్ కమ్ముల రాక స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో  పని చేయడం. దేవి బీట్ కి శేఖర్ కమ్ముల క్లాస్ కి ఎలా కుదురుతుందని  ప్రేక్షకులు కొంత ఆలోచనలో పడ్డారు. 

అయితే ఈ రోజు కుబేర సినిమా నుండి మొదటి పాటని విడుదల చేసారు. దేవి పాటకు భాస్కర భట్ల  సాహిత్యాన్ని అందించగా హీరో ధనుష్ పాడటం జరిగింది. ఈ పాట వినగానే ధనుష్ పాడితేనే వినాలనిపించే పాటగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ తెలివిగా ధనుష్ అభిమానులను ఆకట్టుకునే విధంగా, తమిళ పాటలకు దగ్గరగా ట్యూన్ ఇవ్వటం జరిగింది. దేవి కొత్తగా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

భాస్కర భట్ల ఈ పాటని మనం మాట్లాడుకునే రోజూ వారి వాడుక భాషలో రాసినట్టు అర్ధమవుతోంది. మాస్ ఆడియన్స్ కి దగ్గరగా ఈ పాటని రాసినట్టు తెలుస్తోంది.

ఈ పాట విన్నప్పుడు  దేవి శ్రీ ప్రసాద్  హీరో ధనుష్ గొంతుకి తగ్గట్టుగా ట్యూన్ చేసాడేమో అని అనిపిస్తుంది. అలాగే కొన్ని సార్లు ధనుష్ పాడిన పాత పాటలను కూడా గుర్తుచేస్తుంది.  ఈ పాటలో ఎప్పటి లాగే ధనుష్ మాస్ డ్యాన్స్ తో ఇరగదీసాడు అనిచెప్పొచ్చు. ఇక థియేటర్లో ఫ్యాన్స్  విజిల్స్ తో పాటు  స్టెప్పులు కూడా వేయొచ్చు. 

Poyiraa Mama song Lyrics
















Poyiraa Mama Song Details

Song Name: Poyiraa Mama

Movie: Kuberaa

Cast: Dhanush, Nagarjuna, Rashmika

Music: Devi Sri Prasad

Lyrics: Bhaskarabhatla

Singers: Dhanush

Director: Sekhar Kammula  

Producer:  Suniel Narang, Puskur Ram Mohan Rao


Poyiraa Mama Lyrics


యే వన్ డే హీరో నువ్వే ఫ్రెండు 

నీ కోసమే డప్పుల సౌండు

అస్సల్ తగ్గక్ అట్నే ఉండు 

మొక్కుతారు కాళ్ళు రెండు 

నిన్నే చూస్తున్నాది చూడు 

ఊరు మొత్తం దేవుడు లాగ

వన్వేలోన నువ్వెల్లిన 

ఆపారు నిన్ను అందరి లాగ 

రథం మీద నువ్వే అలాగా... 

దూసుకేల్తావుంటే అబ్బో యమాగా 

సియం పియం ఎదురే వచ్చినా 

నువ్వు సలాం కొట్టే పనే లేదుగా 

ముదరిలాగా అంత ఈజీగా 

నిన్నే కలుసులేరుగా

నీతో ఫోటో దిగాలన్నా 

చచ్చేటంత పనవుతుంది గా 

ఓ ఓ ఓ ....

పోయిరా పోయిరా పోయిరా  పోయిరా మావా

అరె రాజా లాగా దర్జాగా పోయిరా మావా 

పోయిరా పోయిరా పోయిరా  పోయిరా మావా

అరె రాజా లాగా దర్జాగా పోయిరా మావా


చూస్తూ చూస్తూనే మారింది నీ రేంజు ఈ రోజున

నిన్నె అందుకోవాలనుకుంటే సరిపోదే ఏ నిచ్చెన 

సొమ్ములైన సోకులైన తలొన్చవ నీ ముందర 

నిన్నే కొనే ఐసా పైసా ఈ లోకంలో ఏడుందిరా 

నిన్నే తిట్టి గల్ల పట్టి సతాయించే సారే లేరురా 


పోయిరా పోయిరా పోయిరా  పోయిరా మావా

అరె రాజా లాగా దర్జాగా పోయిరా మావా 


నీతోటి మాటాడి గెలిచేటి దమ్మే ఈడ లేదెవడికి 

స్వర్గం అరె నీ జేబులో ఉంది బాదే లేదు ఏనాటికి 

ఎరాప్లేను రాకెట్టు నీ కాళ్ళ కింద ఎగరాల్సిందే 

ఎంతోడైనా తలే ఎత్తి అలా నిన్ను చూడాల్సిందే 

తల రాతని చెరిపి మల్ల రాసేసుకో నీకే నచ్చిందే 


ఓ ఓ ఓ ....

పోయిరా పోయిరా పోయిరా  పోయిరా మావా

అరె  మహా రాజా లాగా దర్జాగా పోయిరా మావా 

 ఓయ్  పోయిరా పోయిరా పోయిరా  పోయిరా మావా

అరె రాజా లాగా దర్జాగా పోయిరా మావా


WATCH  పోయిరా మావ   LYRICAL VIDEO SONG

Monday, April 14, 2025

Darsanamey Song Lyrics

April 14, 2025 0

Darsanamey Lyrics - Yazin Nizar


శర్వానంద్  "నారీ నారీ నడుమ మురారి" తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుండి దర్శనమే అనే లిరికల్ విడియోని విడుదల చేసారు. ఈ పాట విన్న మొదటి సారే మనకు నచ్చేస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన సంగీతం సూపర్ గా ఉంది. మంచి మెలోడీ అని చెప్పొచ్చు. సితార్ వాయిద్యం తో మొదలైన ఈ పాట యాజిన్ నిజార్ గొంతులో వినడానికి చాలా బాగుంది. పాటకి తగ్గ పదాలను రామజోగయ్య శాస్త్రి అందించారు. మొత్తం తెలుగు పదాలతో నిండిన పాట ఇది. పాట మొత్తంలో బ్యాక్ గ్రౌండ్  సితార్ వాయిద్యం చాలా బాగుంది. సీతా రామం తరువాత విశాల్ చంద్రశేఖర్ ఇంత మెలోడీ పాట ఇదేనేమో.

ఇందులో శర్వానంద్ ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. చాలా రోజుల తరువాత సంయుక్త మీనన్ తెలుగులో కనబడుతోంది. ఈ విడియో చూస్తె మనకు ఖుషి సినిమాలో ప్రేమంటే సులువు కాదురా పాట లోని పవన్ కళ్యాణ్, భూమిక మధ్య  సన్నివేశం రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. నూడుల్స్ తింటుంటే పవన్ కళ్యాణ్ స్పూన్ ని   కావాలని కింద పడేసి భూమిక స్పూన్ తీసుకొని తినేస్తాడు. అదే సీన్ NNNM లో శర్వానంద్, సంయుక్త మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. 

   


Nari Nari Naduma Murari













DARSANME SONG DETAILS

Song Name: Darsaname

Movie: Naari Nari Naduma Murari

Cast: Sharwanand, Samyuktha Menon

Music: Vishal Chandrashekhar

Lyrics: Ramajogayya Sastry

Singers: Yazin Nizar

Director: Ram Abbaraju

Producer:  AK Entertainments



Darsanamey Lyrics


దర్శనమే మధుర క్షణమే 
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాద స్వరమే 
నాదాక నిన్ను నడిపింది ప్రేమే 
నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే 
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....

నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే 
నీ పదాలకు సిరి సిరి మువ్వనైన  నేనే 
నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే 
నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే 
నీ చూపు నేనే నీ రేపు నేనే 
నీ యదలో కదిలి  మెదిలే  ఆ సవ్వడైన నేనే 
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....

రాసి ఇవ్వనా నా నవ్వులన్ని నీకే 
స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే 
నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం 
నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం
నా రామసీత నా ప్రేమ గీత
నువ్విల జతగా నిలిచి నా కలలు  పండెనంట 
దర్శనమే మధుర క్షణమే 
నీవు నేను ఇక మనమే

దర్శనమే మధుర క్షణమే 
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాద స్వరమే 
నాదాక నిన్ను నడిపింది ప్రేమే 
నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే 
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....


WATCH  దర్శనమే  LYRICAL VIDEO SONG