Kollagottinadhiro Lyrics - Mangli, Rahul Sipligunj, Ramya Behara, Yamini Ghantasala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీర మల్లు పార్ట్ 1 . పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు తక్కువ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక తను సినిమా అనే పదానికి దూరంయ్యాడని చెప్పొచ్చు. కానీ ఇప్పటికే మొదలుపెట్టి మధ్యలో ఉన్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు దర్శకుడు క్రిష్, కానీ ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆలస్యమవటంతో దర్శకుడిగా క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. మిగతా సినిమాని ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాకి ఆస్కార్ విజేతలు కలసి పనిచేసారు. మ్యూజిక్ యం.యం కీరవాణి అందించగా చంద్రబోస్ ఈ పాటని రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాడటం జరిగింది.
Song Information
Song Name: Kollagottindhiro
Movie: Hari Hara Veera Mallu
Cast: Pawan Kalyan, Nidhhi Agerwal, Bobby Deol
Music: M M Keeravani
Lyrics: Chandrabose
Singers: Mangli, Rahul Sipligunj , Ramya Behara, Yamini Ghantasala
Director: Jyothi Krisna & Krish Jagarlamudi
Producer: A. Dayakar Rao
Lyrics in Telugu
కోర కోర మీసాలతో
కొదమ కొదమ అడుగులతో
కొంటె కొంటె చెనుకులతో
కొలిమిలాంటి మగతిమితో
సరసర వచ్చినాడు
చిచ్చర పిడుగంటివాడు
ఎదో ఎదో తలచినాడు
ఎవ్వరినో వెతికినాడు
ఎవరంట ఎవరంట… ఎవరెవరంట
ఎవరంట ఎవరంట ఎవరెవరెవరెవరంట
కొండపల్లి ఎండి బొమ్మా
కోల కళ్లతో చూసిందమ్మా
తియ్య తియ్యని తేనెలకొమ్మ, ఆ ఆ ఆ
తియ్యని తెరలే తీసిందమ్మా…
(యాయియే యాయ్ యాయ్)
వజ్రాల జిలుగులున్న
రత్నాల ఏలుగులున్న
కెంపుల్ల ఒంపులున్న
మొహరీలా మెరుపులున్నా, ఓ ఓ హో
నా పైడి గుండెలోన ఏడి పుట్టించి
మరిగించి మరిగించి… కరిగించి కరిగించి
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో… ముల్లేగట్టినాదిరో
నారిన్ననో, నారిన్ననో నారిన్ననో, ఓ ఓ
నారిన్న నారిన్ననో…
అయ్యయ్యయ్యో… అయ్యయ్యయ్యో
ఆ చిన్నదీ ఇంకేమి చేసిందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
ఆ కుర్రదీ… ఏ మంత్రమేసిందయ్యో
కన్నులలోని… కాటుక మేఘం
సీకటి నాపై సిలికిందే…
మాటలతోనే… మెలికేసిందే
మర్మం ఏదో దాసిందే…
ఆడవాళ్ళ మనసు అడవిలాంటిదని
ఎరగని సంటోడివా??
అంత అమాయకుడివా
పడుసుపిల్ల తీరు
పట్టుసిక్కదని పసిగట్టలేనోడివా..!
ఒట్టి శొంటికొమ్మువా..?
లేత ఎన్నపూసవా..?
అరె మీసాల రోషాల
మొనగాన్ని పట్టేసి
పసివాన్ని చేసేసి
పసరేదో పూసేసి…
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో… ముల్లేగట్టినాదిరో
నారిన్ననో, నారిన్ననో నారిన్ననో, ఓ ఓ
నారిన్న నారిన్ననో…
హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్… హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఊపిరిలోని ఆవిరి పవనాలే
విరివిగ లేఖలే విసిరేనే
ఉప్పెనలాగ పొంగే పౌరుషమే
సొగసుకు సంకెల వేసేనే
చీకుచింత లేని వాడి చిత్తం దోచావే
పారహుషార్ పోరగాడ్ని పాగల్ చేసావే
దారెదైనా దవ్వేదైన నీడై ఉంటానే
పేరేదైనా తీరేదైనా పెనిమిటి అంటానే
అడ్డడ్డే, కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో… కొల్లా గొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో… ముల్లేగట్టినాదిరో
నారిన్ననో, నారిన్ననో నారిన్ననో, ఓ ఓ
నారిన్న నారిన్ననో…

No comments:
Post a Comment