New Songs Lyrics Telugu

Saturday, April 12, 2025

Rama Raama song Lyrics

Rama Raama Lyrics - Shankar Mahadevan, Lipsika Bhashyam


హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా నుండి రమ రామ అనే లిరికల్ విడియోని విడుదల చేసారు. మొదటి నుండి హనుమాన్ భక్తుడైన చిరంజీవి రమ రామ పాటని తన అభిమానుల కోసం హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత యం.యం. కీరవాణి సంగీతం అందించగా, రామ జోగయ్య శాస్త్రి రచించగా శంకర్ మహదేవన్ మరియు లిప్సిక ఆలపించారు.

భక్తి పాటలు పాడి రక్తి కట్టించడం లో దిట్ట శంకర్ మహదేవన్ అని చెప్పొచ్చు. ఈ పాటని కూడా రమ రామ రమ రామ అంటూ భక్తి మయంతో పాడారు. శ్రీ రాముని భక్తునిగా  సీతారాముల కల్యాణం సందర్భంగా  వారి గురించి చెప్పుకునే పాటగా ఈ పాటని వ్రాయడం జరిగింది.  "రామయ్య  కీర్తన  నోరార పలుకగా చిరంజీవి నీ జనుమా" అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 

ఈ పాట లో చిరంజీవి లుక్ బాగుందని చెప్పొచ్చు. డాన్స్ గురించి మాట్లాడితే ఈ విడియోలో ఉన్నంత వరకు స్టెప్స్ బాగున్నాయి.  ఈ పాట చూస్తె  "అల్లుడా మజాకా" సినిమా లోని మా వూరి దేవుడు అందాల రాముడు  పాట గుర్తుకు వస్తోంది. 


Rama Rama Song -Vishwambhara













RAMA RAAMA SONG DETAILS

Song Name: Rama Raama

Movie: Vishwambhara

Cast: Megastar Chiranjeevi, Trisha Krishnan,Ashika Ranganath

Music: M M Keeravani

Lyrics: Ramajogayya Sastry

Singers: Shankar mahadevan, Lipsika

Director: Vassishta

Producer:  UV Creations


Rama Raama Lyrics

జై శ్రీ రామ్ 

రమ రామ రామ రమ రామ రామ 
రమ రామ రామ రమ రామ .....

రమ రామ రామ రమ రామ రామ 
రమ రామ రామ రమ రామ .....


హే తయ్య తక్క  తక్క ధిమి 
చెక్కా భజనలాడి 
రాములోరి గొప్ప చెప్పుకుందామ 

ఆ సాములోరి పక్కనున్న 
సీతా మాలక్చ్మమ్మ 
లక్షణాలు ముచ్చటించుకుందామా 

నీ గొంతు  కలిపి 
మా వంత పాడగ 
రావయ్య  అంజని హనుమా 
రామయ్య కీర్తన నోరార పలుకగ 
చిరంజీవి నీ జనుమ 

రమ రామ రామ రమ రామ రామ 
రమ రామ రామ రమ రామ .....


రమ రామ రామ రమ రామ రామ 
రమ రామ రామ రమ రామ .....


శివుని ధనువు వంచినోడు ... శ్రీ రామ్ 
రావణ మదము తెంచినోడు .. శ్రీ రామ్ 
ధర్మము విలువ పెంచినోడు ... దశరధ సుతుడు 

అతడి జంటగ అమ్మతోడు 
మాయమ్మ సీతమ్మ సరిజోడు 
పట్టిన మగని కొనవేలు 
వీడలేదు ఎప్పుడూ

పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు 
ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు
అన్నయ్యంటే ఇతడు

హే రంగ రంగ వైభవంగా 
రామ కళ్యాణ వేళ
సంబరాల పాట పాడుకుందామా 

హే  రంగు రంగు ఉత్సవాల కోలాటమాడుకుంటు 
చిన్న పెద్ద చిందులాడుకుందామా 

నీ గొంతు కలిపి 
మా వంత పాడగ 
రావయ్య  అంజని హనుమా 
రామయ్య కీర్తన నోరార పలుకగ 
చిరంజీవి నీ జనుమ 

రమ రామ రామ రమ రామ రామ 
రమ రామ రామ రమ రామ .....

రమ రామ రామ రమ రామ రామ 
రమ రామ రామ రమ రామ .....



WATCH  రామ రామ  LYRICAL VIDEO SONG

No comments:

Post a Comment