Latest Telugu movie COURT Premalo Songs Telugu Lyrics
ప్రేమలో తెలుగు పాటని పూర్ణా చారి పదాలను
సమకూర్చగా, విజయ్ బుల్గనిన్ స్వరాలను అందిచారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి మరియు సమీర
భరద్వాజ్ తమ గాత్రంతో ప్రాణం పోశారు. కోర్ట్ సినిమాలోని ఈ పాట 2025 సంవత్సరంలో
మంచి పాటల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Premalo Song Details:
Song Name
Premalo
Film
Court
Language
Telugu
Singer
Anurag Kulkarni, Sameera Bharadwaj
Lyrics By
Purna Chary
Composer
Vijai Bulganin
Produce By
Nani
Premalo Song Lyrics- Telugu
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత , అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత. అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె
అన్ని మాటలు …
ముందు లేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలు …
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో , తప్పు లేదు ప్రేమలో
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో , తప్పు లేదు ప్రేమలో..
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత , అరెరే
ఆకాశం తాకాలి … అని ఉందా
నాతోరా చూపిస్తా … ఆ సరదా ఆ ఆ
నేలంతా చూట్టేసే వీలుందా ఆ ఆ
ఏముంది ప్రేమిస్తే సరిపోదా , ఆ ఆ
అహ మబ్బులన్ని కొమ్మలై
పూల వాన పంపితే
ఆ వాన పేరు ప్రేమలే
దాని ఊరు మనములే
ఏ మనసుని ఏమడగకు
ఏ రుజువుని ఓ ఓ … అంతే ఓ ఓ
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
మ్మ్ , ఎంతుంటే ఏంటంటా దూరాలు
రెక్కల్లా అయిపోతే పాదాలు
ఉన్నాయా బంధించి దారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరె నింగిలోని చుక్కలే
కిందకొచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే
ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరెను
పొరపాటునా అని , ఓ ఓ … అంతే ఓ ఓ
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో , తప్పు లేదు ప్రేమలో
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత , అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత , అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె
అన్ని మాటలు …
ముందు లేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో , తప్పు లేదు ప్రేమలో , ఓ ఓ ……
Premalo Music Video
VIDEO
No comments:
Post a Comment