Uyyaalo Uyyaala (ఉయ్యాలో ఉయ్యాల) Song Lyrics in Telugu
Movie: BHAGAVANTH
KESARI
Singer: S P CHARAN
Lyrics: ANANTHA
SRIRAM
Music: THAMAN
S
Lyrics
ఉడత ఉడత ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
ఉడత ఉడత ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
సిలక సిలక గప్పు సుప్
గమ్మున కూసోర్రి
నీకన్న తియ్యగ పలుకుతాంది
మా పొట్టి పొన్నారి
నువ్ ఊరకవే నా తల్లి
తుల్లి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసి వోతే
గుండెపై వాలిపోవే జాబిల్లి
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాల
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాల
ఉడత ఉడత ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
అమ్మనైత లాల పోస్తా
అయ్యనైత జోల పాడుతా
అవ్వనైత బువ్వ పెడతా
దువ్వేనైత జడలల్లుతా
పత్తి పువ్వైతా
నీకు రైక లెయ్యనీకి
పట్టు పురుగైత
నీకు పావడియ్యనీకి
ఏమన్నైతే నీక్ ఏమన్నైతే
నేన్ ఏమన్నైతా నిన్ను కాయానికి
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాల
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాల
ఒప్పుల గుప్పా ఉయ్యాలో
వయ్యారి భామా ఉయ్యాలో
సిగ్గుల మొగ్గ ఉయ్యాలో
సింగారి బొమ్మ ఉయ్యాలో
వోనెల నెమలమ్మ రాని లేక్కస్తంటే
ఊరూరంతా ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సంబరాలా గుమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
No comments:
Post a Comment